
సభను విజయవంతం చేయాలి
కామారెడ్డి టౌన్/రాజంపేట: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నేడు నిర్వహించే లంబాడ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) విజయోత్సవ సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి గుగ్లోత్ వినోద్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఎల్‌హెచ్‌పీఎస్ 28 ఏళ్లు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, నేతలు శంకర్, రూప్‌సింగ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ తదితరులున్నారు.