
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
బోధన్‌రూరల్: మండలంలోని బండార్‌పల్లికి చెందిన సాయికుమార్(28) చేపల వేటకు వెళ్లి ప్రవమాదవశాత్తు వల చుట్టుకుని నీటి మునిగి మృతిచెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. మృతుడి భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అర్గుల్‌లో ఒకరి అదృశ్యం
జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్‌లో నివాసముంటున్న లింగంపేట గ్రామానికి చెందిన కొరబోయిన అశోక్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. ఈ నెల 28న రాత్రి 9 గంటలకు జక్రాన్‌పల్లిలోని తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి బైక్‌పై వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. అశోక్ తండ్రి ప్రభురాజ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పోచంపాడ్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం
బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్‌లో సోమవారం ఉదయం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలో వీధుల గుండా కనిపించిన వారిపై దాడి చేశాయి. దీంతో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రజిత చేతిపై, విఠల్, విష్ణులకు కంటి, కాలి భాగాలపై దాడి చేసి గాయపర్చాయి. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పోచంపాడ్‌లో వీధి కుక్కులు ఎక్కువ కావడంతో కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్ విగ్రహావిష్కరణలో దొంగల చేతివాటం
నిజామాబాద్ రూరల్: కంఠేశ్వర్ బైపాస్ సిగ్నల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డీఎస్ విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవిష్కరణలో మారుతినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కాసుల రఘు, అలాగే బాశెట్టి గంగాధర్‌కు చెందిన బంగారు గొలుసులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో ఆరిఫ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి