
జుక్కల్ అభివృద్ధే నా మొదటి ధ్యేయం
మద్నూర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధే నా మొదటి ధ్యేయమని దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. డోంగ్లీ మండలంలోని ఇలేగావ్ నుంచి మదన్‌హిప్పర్గా వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నాయకులు చాంద్ పటేల్, నాగేశ్ పటేల్, యూనుస్ పటేల్, బండు పటేల్, నాయకులు, కార్యకర్తలున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
బిచ్కుంద(జుక్కల్): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండి ఒకొక్క హామీ నెరవేర్చుతున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం మెక్కా గ్రామంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాల నుంచి బీటీ రోడ్డు కోసం మెక్కా ప్రజలు ఎదురుచూస్తున్నారు నేటితో వారి కల నెరవేరిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ పటేల్, విఠల్‌రెడ్డి, నాగ్‌నాథ్, వెంకట్‌రెడ్డి, సయ్యద్ మసూద్, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ లైటింగ్ పనుల పరిశీలన
బిచ్కుందలో కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రెండు వైపులా డ్రైనేజి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను సూచించారు.
చెట్లతోనే పర్యావరణ పరిరక్షణ
నిజాంసాగర్(జుక్కల్): చెట్లతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం జుక్కల్‌లో ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటా మొక్కలు నాటి కాపాడాలన్నారు. కాంగ్రెస్ నేతలు రమేష్ దేశాయ్, సాయాగౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులున్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు