
వసతుల కల్పన నా బాధ్యత
నస్రుల్లాబాద్: పాఠశాలలో వసతులను కల్పించడం నా బాధ్యత .. చదువు చెప్పడం ఉపాధ్యాయుల బాధ్యతని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నెమ్లి గ్రామంలో సోమవారం పీఎంశ్రీ పాఠశాలలో రూ.40.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్, అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ ప్రజలకు విద్య, వైద్యం చేరువ అవ్వాలనే పని చేస్తున్నానన్నారు. ప్రత విద్యార్థి ఉన్నతంగా చదవాలంటే సౌకర్యాలు ఉండాలన్నారు. అందులో భాగంగానే విద్యార్థులు చదవడానికి అదనపు గదులను నిర్మించామన్నారు.
ఎడ్యుకేషన్ అనేది గేమ్ చేంజర్:
సబ్ కలెక్టర్ కిరణ్మయి
ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో గేమ్ చేంజర్ అని బాన్సువాడ సబ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. ఉన్నతంగా చదివుతేనే జీవితంలో విజయం సాధిస్తామన్నారు. అరకొర వసతుల మధ్య విద్యను చదువుకున్న రోజుల్లోనే ఎంతో మంది తమ జీవితాలను మార్చుకున్నారని కాని ప్రభుత్వం ప్రస్తుతం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వాటిని ఉపయోగించుని ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, తహసీల్దార్ సువర్ణ, ఎంఈవో చందర్ నాయక్, ఎంపీడీవో సూర్యకాంత్, ఏఎంసీ చైర్మన్ శ్యామల, తదితరులు పాల్గొన్నారు.
చదువు చెప్పడం ఉపాధ్యాయుల బాధ్యత
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
అదనపు తరగతి గదుల ప్రారంభం