
‘అప్పు తీరినా.. సబ్సిడీ మంజూరు కాలేదు’
కామారెడ్డి అర్బన్: మూడేళ్ల క్రితం బ్యాంకు రుణం ద్వారా ట్రాక్టర్‌ను కొనుగోలు చేయగా పరిశ్రమల శాఖ ద్వారా రావాల్సిన సబ్సిడీ ఇంకా విడుదల కాలేదని కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామస్తుడు కుర్మకులానికి చెందిన దివ్యాంగుడు దొంతల శివరాజు వాపోయారు. 2022లో దాదాపు రూ.12 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, భూమి దున్నడానికి అవసరమయ్యే నాగళ్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేయగా.. పరిశ్రమల శాఖ ద్వారా రూ.3లక్షల 9వేల 750 లు సబ్సిడీ విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ వి.లాలు.. 2022లో సబ్సిడీ ఉత్తర్వులు ఇచ్చారు. ట్రాక్టర్‌పై కామారెడ్డి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణం వాయిదాలు చెల్లించినప్పటికి పరిశ్రమల శాఖ సబ్సిడీ ఇంకా విడుదల కాలేదు. సబ్సిడీ కోసం రూ.30 వేలు మధ్యవర్తులకు ఖర్చు చేశానని దొంతల శివరాజు వాపోయాడు.