
స్థానిక సమరానికి సిద్ధం కావాలి
మాచారెడ్డి: బీఆర్‌ఎస్ యూత్ సభ్యులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధ కావాలని బీఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు గంప శశాంక్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్‌ఎస్ సోషల్ మీడియా, యూత్ వింగ్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. నాయకులు రామ్మూర్తిగౌడ్, లస్కర్‌నాయక్, దేవరాజు తదితరులున్నారు.
గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
మాచారెడ్డి: పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై అనిల్ సూచించారు. పాల్వంచ మండలం బండరామేశ్వర్‌పల్లి గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఉంటే పోలీసులు ఉన్నట్టేనన్నారు. గ్రామస్తులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు
బాన్సువాడ రూరల్: కాంట్రాక్టర్ చిన్న రాంపూర్ మజీద్‌లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మజీద్ వద్ద షట్టర్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి రూ.15 లక్షలు మంజూరు చేశారని, కాంట్రాక్టర్ సగం పనులు చేసి వదిలేశారని ఆరోపించారు. మిగిలిన పనులను పూర్తి చేయించాలని కోరారు. కార్యక్రమంలో మజీద్ సదర్ షేక్ అక్బర్, గ్రామస్తులు షేక్ అజీమ్, అజీజ్, మహిమూద్, నజీర్, అస్లాం, అఫ్రోజ్, ఇల్యాస్, సజ్జద్, మంజూర్, ఇర్షాద్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.
హద్దు స్తంభాల ధ్వంసం
భిక్కనూరు: మండల కేంద్రంలోని వీడీసీకి చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన హద్దు స్తంభాలను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం వేకువజామున ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అఖిల పక్షం నేతలు ఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించారు. మాజీ సర్పంచ్ తున్కి వేణు, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, నేతలు తదితరులు ఉన్నారు.

స్థానిక సమరానికి సిద్ధం కావాలి

స్థానిక సమరానికి సిద్ధం కావాలి