
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సైడ్‌లైట్స్..
సుభాష్‌నగర్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ప్రారంభోత్సవం, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ విగ్రహావిష్కరణ, కిసాన్ సమ్మేళనం బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఆయన పర్యటన సైడ్‌లైట్స్..
● 2.30 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం.
● 2.45 గంటలకు బోర్డు కార్యాలయంలో ప సుపు రైతులతో ముఖాముఖి, పసుపు పంట ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు.
● 3.28 నగరంలోని కంఠేశ్వర్ బైపాస్‌లో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ విగ్రహావిష్కరణ.
● 3.35 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభ వేదికపైకి చేరుకున్నారు. వేదికపైకి రాగానే పసుపు రైతులు, ప్రజలకు అభివాదం చేశారు.
● 3.50 గంటలకు అమిత్ షా ప్రసంగం ప్రా రంభించి, 18 నిమిషాల్లో ముగించారు.
● ప్రసంగం మధ్యలో పసుపు బోర్డు ప్రకటన, జిల్లా కేంద్రంలో జాతీయ కార్యాలయం ఏర్పాటుపై ప్రజలందరూ నిల్చొని కరతాళధ్వనులతో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపాలని కోరడంతో.. ప్రజలు, రైతులు ఆయనను అనుకరించారు.
● భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరాం అంటూ అమిత్ షా తన ప్రసంగాన్ని ముగించారు.
● అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి శాలువా, జ్ఞాపికతో అమిత్ షాను సత్కరించారు.
● కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ పేరు ప్రస్తావించినప్పుడల్లా ప్రజలు, రైతులు ఈలలు, కేకలు వేశారు.