
స్నేహానికి షష్టి పూర్తి
నార్కట్‌పల్లి: స్నేహానికి షష్టి పూర్తి.. మరువలేని అనుభూతి అని శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపాలయపల్లి గ్రామ సమీపాన గల శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయ చైర్మన్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పెద్దన్న కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి 1965లో నిజామాబాద్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదివారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన క్లాస్‌మెట్. పదో తరగతి పూర్తి చేసి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మరికొందరు మిత్రులు ఆదివారం శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించా రు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పెళ్లికి షష్టి పూర్తి, వయసుకు షష్టిపూర్తి ఉంటాయని, స్నేహానికి షష్టి పూర్తి చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.