
గుంతల రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీ ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ శనివారం వారు అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ రోడ్డుపై చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి నూతన రోడ్డు వేయాలని కోరారు. మాజీ కౌన్సిలర్ అర్కల ప్రభాకర్‌యాదవ్, జగదీష్‌యాదవ్, శ్రీనివాస్, రాజే్‌ష్, మల్లేష్ తదితరులున్నారు.

గుంతల రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి