
‘రాజ్యాంగమే బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో’
కామారెడ్డి అర్బన్: భారత రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టోగా కలిగిన ఏకై క పార్టీ బీఎస్పీ అని పార్టీ అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఎస్పీ జిల్లా కార్యాలయలో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ హాజరయ్యారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కోసం బీఎస్పీ కృషి చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా పరుశరామ్‌ను నియమించారు. జిల్లా అధ్యక్షుడు మా లోత్ హరిలాల్ నాయక్, ఉపాధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి దుంపల సురేష్, రోహిత్‌దాస్, నత్తి జీవన్, ప్రవీణ్, ప్రభాకర్ దాస్, సంతోష్, మనోహర్ పాల్గొన్నారు.