
పాఠశాలల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): పాఠశాలల పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎంఈవో షౌకత్‌అలీ అన్నారు. లింగంపేట బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన మండలంలోని ప్రభుత్వ బడుల హెచ్‌ఎంలకు ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య యూడైస్ ప్లస్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే విద్యార్థులకు అందజేసిన పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు, ఏకరూప దుస్తువులు, మధ్యాహ్న భోజనం బిల్స్, పాఠశాలల నిధులు, ఉపాధ్యాయుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఐఎస్‌ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.