
అంగన్‌వాడీలకు ఫోన్లు అందేదెప్పుడు?
ఎల్లారెడ్డి: అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కార్యకర్తలకు అధునాతనమైన ఆండ్రాయిడ్ ఫోన్లను 5జీ సౌకర్యంతో అందజేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలో ప్రకటించింది. ఈక్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పైఅధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు యాప్‌లను ప్రవేశ పెట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు ఆన్‌లైన్ నమోదుతో ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి, నూతన ఫోన్లను అందిస్తామని మంత్రి ప్రకటన చేయడంతో ఇక్కట్లు తీరుతాయని భావించారు. కానీ ఇంతవరకు ఆండ్రాయిడ్ ఫోన్లను అందజేయక పోవడంతో సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో 1193 అంగన్‌వాడీ కేంద్రాలు..
కామారెడ్డి జిల్లాలో 1193 అంగన్‌వాడి కేంద్రాలు ప నిచేస్తున్నాయి. వీటి పరిధిలో ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులు 30,846, 3నుంచి 6ఏళ్ల వయస్సు గల చిన్నారులు 20,502 మంది ఉన్నా రు. అంతేగాక ఈ కేంద్రాల పరిధిలో 6,388 గర్భిణులు, 5,957 మంది బాలింతలకు పలు రకాల సే వలు అందజేస్తున్నారు. పూర్వ ప్రాథమిక కేంద్రాలు గా ఆధునీకరించిన ఈ అంగన్‌వాడీ కేంద్రాల సేవ లను డిజిటలైజేషన్ చేసి అనుక్షణం పైఅధికారుల పర్యవేక్షణ చేసేందుకు పలు యాప్‌లను ప్రభుత్వం ఏర్పరిచింది. కానీ అంగన్‌వాడీ సిబ్బందిలో చాలామంది పాత ఫోన్లను వాడటంతో అప్‌డేట్ కాకపోవడంతో యాప్‌లో వివరాల నమోదు కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పలువురు కార్యకర్తలు అంటున్నారు. ఎవరో కొద్దిమంది వద్ద తప్ప మిగితా అందరి వద్ద అధునాతన ఫోన్లు లేకపోవడంతో నమోదు ప్రక్రి య ఇబ్బందిగా మారిందని వారు తెలిపారు. చాలీచాలని జీతాన్ని పొందుతున్న తమకు వేలకు వేలుపోసి అధునాతన ఫోన్లను కొనడం ఎలా సాధ్యపడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రకటించినట్లు నూతన ఆండ్రాయిడ్ ఫోన్లను అందజేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంగన్‌వాడీలు కోరుతున్నారు.
వివరాల నమోదు కోసం ఆండ్రాయిడ్ ఫోన్లను అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం
నెలలు గడుస్తున్నా జాడలేని
ప్రభుత్వ హామీ
పాత ఫోన్లతో ఇబ్బందులు
పడుతున్న సిబ్బంది