వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు

Jun 29 2025 2:32 AM | Updated on Jun 29 2025 2:32 AM

వర్షా

వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు

రామారెడ్డి: వర్షాకాలం వచ్చినా వానదేవుడు కరుణించడం లేదు. దీంతో చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. దీంతోపాటు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి, బోరుబావులు ఎత్తిపోతున్నాయి. నారుమడికి నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కొందరు రైతులు ట్యాంకర్‌తో నారుమడిని తడుపుతుంటే, మరికొందరు నీటి బిందలు చేతపట్టి నారు మడిని కాపాడుకునే యత్నం చేస్తున్నారు. వానదేవుడు కనికరించి సకాలంలో వర్షాలు కురిస్తేనే వ్యవసాయ పనులు ముందుకు సాగుతాయని రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.

అధికారులను సంప్రదించేదెలా?

నస్రుల్లాబాద్‌: మండలంలోని విద్యుత్‌ శాఖ అధికారుల ఫోన్‌ నంబర్లు మారి నెల రోజులు గడుస్తున్నా, సంబంధిత కార్యాలయంలోని బోర్డుపై ఇంకా పాత నంబర్లే దర్శనమిస్తున్నాయి. దీంతో కార్యాలయనికి వచ్చిన ప్రజలు అధికారుల పాత నంబర్లకు కాల్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు నంబర్లను మార్చకుండా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మండల కేంద్రంలోని సెక్షన్‌ కార్యాలయంలో అధికారుల నూతన నంబర్లను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.

రేషన్‌షాపుల తనిఖీ

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు చిట్యాల గ్రామంలోని రేషన్‌ దుకాణా లను శనివారం సివిల్‌ సప్లయ్‌ డీసీఎస్‌వో మల్లికార్జున బాబు తనిఖీ చేశారు. షాపులకు సంబందించిన స్టాక్‌ బియ్యం, రికార్డులను పరిశీలించారు. ఇతర జిల్లాల నుంచి ఇంకొక జిల్లాకు ఆధార్‌ కార్డుల చిరునామాలు మారినట్లయితే ఒక్క దగ్గరనే బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు ప్రాంతాలలో రెండు ఆధార్‌ కార్డులు ఉన్న వాటిని గుర్తించి, వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపించినట్లు తెలిపారు. డీటీ సురేష్‌కుమార్‌, రేషన్‌ షాపుల డీలర్లు ప్రమీల, సవిత, లబ్ధిదారులు ఉన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

మాచారెడ్డి: మండలంలోని గజ్యా నాయక్‌ తండా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోనె శ్రీహరి, ఉపాధ్యక్షుడిగా గుడ్ల నరేష్‌, కోశాధికారిగా అల్లె బ్రహ్మం, ప్రధాన కార్యదర్శిగా గోనె చంద్రమౌళి, కార్యదర్శిగా గోనె ఆంజనేయులు, సలహాదారులుగా గాజుల శ్రీధర్‌, గోనె సత్యనారాయణ, తుమ్మ రాజేశం, అల్లె రాజేశం, ఇప్పలపల్లి శ్యామ్‌, ఈరబత్తిని ప్రసాద్‌, గుండ్లపల్లి నరేష్‌, గోనె సురేష్‌ ఎన్నికయ్యారు.

వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు 
1
1/3

వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు

వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు 
2
2/3

వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు

వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు 
3
3/3

వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement