
సర్టిఫికెట్లు సకాలంలో అందించాలి
భిక్కనూరు: విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లను సకాలంలో అందజేయాలని టీజీవీపీ నేతలు కోరారు. ఈమేరకు వారు శనివారం భిక్కనూరు తహసీల్దార్ సునితకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్, నేతలు సమీర్, యోగేష్, నరేందర్ పాల్గొన్నారు.
జిల్లా కోర్టు జీపీగా శ్యామ్‌గోపాల్‌రావు
కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లా కోర్టులకు గవర్నమెంట్ ప్లీడర్(జీపీ)గా సీనియర్ న్యాయవాది కావేటి శ్యామ్‌గోపాల్‌రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. పట్టణానికి చెందిన ఆయన 1994 నుంచి న్యాయవాదిగా, సివిల్, క్రిమినల్ కేసులను వాధిస్తూ ఇక్కడ పని చేస్తున్నాడు. ఆయన నియామకంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో
నాలుగు కేసుల పరిష్కారం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ కార్యక్రమంలో నాలుగు కేసులు పరిష్కారమైనట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పలు కారణాల వల్ల విడాకులకు సిద్ధమైన జంటలకు డీఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో నాలుగు కేసులు పరిష్కారమైనట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
యువత పెడదారి పట్టొద్దు
రామారెడ్డి: యువత డ్రగ్స్, గంజాయి వంటివి సేవించి పెడదారి పట్టొద్దని ఎస్సై రాజారాం అన్నారు. రామారెడ్డి హైస్కూల్‌లో శనివారం పోలీస్ కళాబృందం సైబర్ క్రైం షీటీమ్స్ పని తీరుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. షీటీమ్స్ సహాయం కోసం 8712686094ను సంప్రదించాలని విద్యార్థినులు, ఉపాధ్యాయినులకు సూచించారు. హెచ్‌ఎం ఆనంద్, ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామచంద్రం, తిరుపతి, శేషారావు పాల్గొన్నారు.

సర్టిఫికెట్లు సకాలంలో అందించాలి

సర్టిఫికెట్లు సకాలంలో అందించాలి