
క్యూసెక్కు, టీఎంసీ అంటే..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి క్యూసెక్కుల వరద నీరు, టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటారు. అసలు క్యూసెక్కు, టీఎంసీ అనే పదాల పూర్తి అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
● క్యూసెక్కు అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్(క్యూసెక్). ఒక సెకను కాలంలో 28 లీటర్లు నీరు వచ్చి చేరడం, లేదా విడుదలవ్వడం.
● క్యూసెక్కును ప్రాజెక్ట్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలో వినియోగిస్తారు.
● టీఎంసీ అంటే థౌసండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ (శత కోటి ఘనపుటడుగులు) అని అర్థం.
● ఒక్క టీఎంసీకి 2831 కోట్ల లీటర్ల నీరు.
● ప్రాజెక్ట్‌లోకి వచ్చే నీటిని, వదిలిన నీటికి క్యూసెక్కుల్లో తెలుపుతారు. పూర్తి నీటి నిల్వ, నీటి విడుదలను టీఎంసీల్లో చూపుతారు.
● వెయ్యి అడుగుల వెడల్పు, వెయ్యి అడుగుల పొడవు, వెయ్యి అడుగుల ఎత్తులో ఉండే నీరు ఒక టీఎంసీ అవుతుంది.
● 2300 ఎకరాల్లో ఒక్క అడుగు నీరు నిల్వ ఉంటే టీఎంసీకీ సమానం.
– బాల్కొండ
మీకు తెలుసా?