వణుకు పుట్టిస్తున్న | - | Sakshi
Sakshi News home page

వణుకు పుట్టిస్తున్న

Jun 28 2025 5:33 AM | Updated on Jun 28 2025 7:47 AM

వణుకు

వణుకు పుట్టిస్తున్న

శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా ఎ స్పీగా రాజేశ్‌ చంద్ర బాధ్యతలు చే పట్టిన తర్వాత దాదాపు అన్ని పో లీస్‌ స్టేషన్లను తనిఖీ చేశారు. ఏ స్టేషన్‌కు వెళ్లినా అక్కడి రికార్డుల నిర్వహణ, స్టేషన్‌ పరిసరాలను క్షు ణ్ణంగా పరిశీలిస్తున్నారు. రికార్డుల నిర్వహణ సరిగా లేని ఠాణాల్లో అక్క డి అధికారులకు ఎలా నిర్వహించాలన్న దానిపై అవగాహన కల్పిస్తూ పద్ధతి మా ర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆయా పో లీస్‌ స్టేషన్లలో పనిచేసే రైటర్‌లు, కోర్టు డ్యూటీ నిర్వహించే కానిస్టేబుళ్ల నుంచి మొదలుకుని అన్ని విభాగాల సిబ్బందితో పలుమార్లు సమీక్షలు నిర్వహించి అక్రమాలకు, అవినీతికి తావులేకుండా పనిచేయాల ని ఆదేశిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసినా, కేసుల పరిశోధన సరిగా లేకపోయినా, డబ్బుల వసూళ్లకు పాల్పడినా, ఫిర్యాదుదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వారికి సరైన గౌరవం ఇవ్వకపోయినా చ ర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో విధి ని ర్వహణలో బాగా పనిచేసేవారిని అభినందిస్తున్నారు.

పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీలు..

జిల్లాలో ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల బదిలీలు నిర్వహించారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన హెడ్‌ కానిస్టేబుళ్లు, మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఏఎస్సైలను వారు కోరుకున్న స్థానానికి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అలాగే చాలాకాలంగా ఒకేచోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు కూడా స్థానచలనం కల్పించారు. 63 మంది సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఏడుగురు ఏఆర్‌ కానిస్టేబుళ్లు, 79 మంది హోంగార్డులను కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీ చేశారు.

బాధ్యతగా పనిచేసే వారికి ప్రశంసలు

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఎప్పటికప్పుడు ప్రశంసిస్తున్నారు. వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. జిల్లాలో వివిధ సందర్భాల్లో చురుకుగా పనిచేసిన ఇరవై మందికిపైగా పోలీసు సిబ్బందిని ఆయన సన్మానించారు. తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో వారిని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. నిజాయితీగా, బాధ్యతగా పనిచేసి పోలీసు శాఖకు పేరు తేవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని ఆయన పేర్కొంటున్నారు.

న్యూస్‌రీల్‌

విధుల్లో నిర్లక్ష్యం, తప్పుడు పనులపై సీరియస్‌

జిల్లాలో పదిమందిపై సస్పెన్షన్‌ వేటు

ఇందులో ఇద్దరు ఎస్సైలు,

ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు..

మూడున్నర నెలల్లో..

జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో పనిచేసిన ప ది మందిపై ఎస్పీ కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు బాధి తులు, ఫిర్యాదుదారులు, నిందితుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారి పై చర్యలకు ఉపక్రమించారు. రామారెడ్డి ఎస్సై రమేశ్‌, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిపై ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ చేశారు. దీంతో వారి ద్దరినీ సస్పెండ్‌ చేశారు. అలాగే ఇద్దరు హెడ్‌ కా నిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుపైనా సస్పెన్షన్‌ వేటు పడింది. బాన్సువాడ లో తాగి న్యూసెన్స్‌ చేసిన వ్యక్తి విషయంలో వ చ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్‌ కిరణ్‌, హోంగార్డు గంగాధర్‌ దురుసుగా ప్రవర్తించడాన్ని ఎస్పీ సీరియస్‌గా పరిగణించా రు. వారిద్దరినీ సస్పెండ్‌ చేశారు. జుక్కల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ అంబర్‌సింగ్‌ పోలీ సు స్టేషన్‌కు వచ్చిన బాధితులు, నేరస్తులతో చ నువుగా ఉంటూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తానని డబ్బులు డిమాండ్‌ చేస్తున్న విషయం ఎస్పీ దృష్టికి రాగా ఆయనపై చర్యలు తీసుకు న్నారు. నిజాంసాగర్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌ మోహన్‌సింగ్‌ అనైతిక ప్రవర్తనపై సీరియ స్‌ అయి సస్పెండ్‌ చేశారు. నిజాంసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ రాకేశ్‌గౌడ్‌ మ ద్యం సేవించి వాహనం నడిపినందుకు సస్పెన్షన్‌కు గురయ్యాడు. పాస్‌పోర్టు జారీ విషయంలో క్లియరెన్స్‌ ఇచ్చే విషయంలో దొర్లిన తప్పిదానికి స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కృష్ణపై చర్యలు తీసుకున్నారు.

వణుకు పుట్టిస్తున్న1
1/2

వణుకు పుట్టిస్తున్న

వణుకు పుట్టిస్తున్న2
2/2

వణుకు పుట్టిస్తున్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement