
పోచారం నీరే ఆధారం
నాగిరెడ్డిపేట : నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పేరొందిన పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్‌స్టోరేజీలో ఉంది. వర్షాకాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరలేదు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతోంది.
పనులు ప్రారంభించని రైతులు
పోచారం ఆయకట్టుకు ప్రాజెక్టు నీరే ఆధారం. ప్రాజెక్టునుంచి వచ్చే నీటిపై ఆధారపడే పంటలు సాగు చేస్తారు. ప్రాజెక్టుపై ఆధారపడి ఏటా వానాకాలంలో అధికారికంగా 10,500 ఎకరాలలో, అనధికారికంగా మరో 5 వేల ఎకరాలలో పంటలు సాగవుతాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌స్టోరేజీలో ఉండడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. నీరు లేకపోవడంతో సాగు పనులు మొదలు పెట్టలేకపోతున్నారు. దీంతో ఆయకట్టు పరిధిలో భూములు చాలావరకు బీడుగానే కనిపిస్తున్నాయి.
వెలవెలబోతున్న పోచారం ప్రాజెక్టు
నీళ్ల కోసం ఎదురుచూస్తున్నం
పోచారం ప్రాజెక్టు ఆయక ట్టు కింద నాకు ఎకరంనర భూమి ఉంది. ప్రాజెక్టులోకి నీరు ఎప్పుడు వస్తుందా అ ని ఎదురు చూస్తున్నాం. ప్రా జెక్టులోకి వరదరాక ప్రారంభంకాగానే పంటల సాగు పనులు మొదలుపెడతాం. – అంతన్నగారి రవి, ఆయకట్టు రైతు, వాడి
నీరొస్తేనే సాగు పనులు..
నాకు ఎకరం భూమి ఉంది. ప్రాజెక్టు నీటితోనే పంటలు పండిస్తాం. ఈ యేడు ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. ప్రాజెక్టులోకి వరదనీరు వస్తేనే మాకు పంటల సాగు మీద నమ్మకం కలుగుతుంది.
– లక్ష్మయ్య, ఆయకట్టు రైతు, గోలిలింగాల
వర్షాలు లేక..
జిల్లాలోని గాంధారి, తాడ్వాయి, లింగంపేట మండలాల్లో కురిసే వర్షాలతో పోచారం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతుంది. జూన్, జూలై మాసాల్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుంది. ఈసారి జూన్ నెల ముగింపునకు వస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్కనీరు కూడా రాలేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌స్టోరేజీ(0.199 టీఎంసీ)లో ఉంది. ఈ యేడు ముందస్తుగా కురిసిన వర్షాలతో పోచారం ఆయకట్టు రైతులు సంబరపడ్డప్పటికీ ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందుతున్నారు.
వర్షాకాలం మొదలై మూడువారాలు
వానలు లేక.. చుక్క నీరు రాక..
డెడ్‌స్టోరేజీలోనే ప్రాజెక్టు నీటిమట్టం
ఆయకట్టు భూముల్లో మొదలు కాని పంటల సాగు

పోచారం నీరే ఆధారం

పోచారం నీరే ఆధారం