
‘స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి’
కామారెడ్డి అర్బన్ : ప్రజలు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన్ ప్రముఖ్ జగదీశ్ కోరారు. శుక్రవారం లింగాపూర్‌లోని ఎస్‌పీఆర్ హైస్కూల్‌లో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ‘స్వదేశీ విధానాలు, స్వావలంభి భారత్ అభియాన్‌లో విద్యార్థుల పాత్ర’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జగదీశ్ మాట్లాడుతూ పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండానే ఎన్నో విదేశీ వస్తువులను వినియోగిస్తున్నామన్నారు. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్నారు. ప్రధానంగా చైనా, తుర్కియే, అమెరికా వస్తువుల వినియోగాన్ని నిలిపివేయాలన్నారు. స్థానికంగా ఉన్న దుకాణాల్లోనే స్వదేశీ కంపెనీ వస్తువులనే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ప్రాంత యువ ప్రముఖ్ రాహుల్‌కుమార్, జిల్లా సంఘర్షణ ప్రముఖ్ సంతోష్‌గౌడ్, కాలేజ్ ప్రిన్సిపల్ కొమిరెడ్డి మారుతి, ప్రతినిధులు అంజనేయులు, సాహిత్, మనీష్, విశ్రాంత అధ్యాపకులు రంజిత్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.