
‘సాగర్’లోకి ఇన్‌ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,025 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం తెలిపారు. క్యాచ్‌మెంట్ ఏరియాతోపాటు ఎగువన కుండపోతగా కురిసిన వర్షానికి వరద వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 1392 అడుగుల (5.2 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రేపు జాబ్ మేళా
కామారెడ్డి క్రైం: ప్రైవేట్ రంగంలో యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో 20 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు అన్ని సర్టిఫికెట్లతో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 70975 25933, 76719 74009 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
క్రమశిక్షణతో మెలగాలి
కామారెడ్డి అర్బన్: క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థులకు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి దయానంద్ సూచించారు. పట్టణ పరిధిలోని దేవునిపల్లి వాసవీకాలనీలో ఉన్న మైనారిటీ గురుకుల జూనియర్ కళాళాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం కళాశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందజేశారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఆర్‌ఎల్‌సీ కిరణ్‌గౌడ్, ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలీ, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
సాహస అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డు–2024 అవార్డు కోసం సాహస కృత్యాలు చేసిన వారి నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా క్రీడలు, యువజన అధికారి కేఎస్ జగన్నాథన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో భూమి, ఆకాశం, సముద్రంలో సాహస కృత్యాలు చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని సూచించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాలకు..
కామారెడ్డి అర్బన్: జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమాధికారి పి వెంకటేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కులాల్లో గ్రూప్–1లో ఐదు సీట్లు, గ్రూప్–2లో పది సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తిగల వారు జూలై 5వ తేదీలోగా దరఖాస్తులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
మత్తుపదార్థాలకు
దూరంగా ఉండాలి
బాన్సువాడ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బాన్సువాడ కోర్టు జడ్జి భార్గవి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. యువత పెడదారి పట్టకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, ఆల్కహాల్, సిగరేట్, బీడీ, గుట్కా వంటివి సేవించడం కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీనారాయణమూర్తి, మోహన్‌రెడ్డి, భూషణ్‌రెడ్డి, రమాకాంత్, ఆనంద్, హైమద్, అజీం, హర్షద్, కోర్టు సిబ్బంది, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు.

‘సాగర్’లోకి ఇన్‌ఫ్లో

‘సాగర్’లోకి ఇన్‌ఫ్లో