
నీరు వృథా రైతు వ్యథ
బాన్సువాడ : మంజీర నది ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పైపులైన్ లీకేజీలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాన్సువాడ, తాడ్కోల్, చింతల్‌నాగారం శివార్లలోని పంట పొలాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో మంజీర నది ప్రాంతంలో ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేశారు. ఈ ఎత్తి పోతల పథకం కింద సుమారు 600 ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా, నిర్వహణ బాధ్యత కోసం రైతులే ఓ కమిటీని ఏర్పాటు చేసి పైపులైన్ లీకేజీలు, మోటార్ల మరమ్మతులు చేయిస్తారు. పంటలు చేతికొచ్చిన తర్వాత ఎకరానికి 70 కిలోల ధాన్యం బస్తాను కమిటీకి చెల్లిస్తారు. ఇలా వసూలైన ధాన్యాన్ని విక్రయించి మోటార్ల మరమ్మతులు, పైపులైన్ లీకేజీలు, కాలువల మరమ్మతులు చేయిస్తారు. ఎత్తిపోతల పైపులైన్ వేసి చాలా ఏళ్లు కావడంతో పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పోతోంది. నీరు వృథాగా పోతున్న ప్రాంతంలో భారీగా జమ్ము మొలవడమే కాకుండా నీరు పొలాల్లోకి చేరుతోంది. దీంతో పొలాలు జాలుపట్టి పంటలు సరిగా పండడం లేదు. సుమారు 200 ఎకరాల్లో ఎప్పుడూ నీరు ఉంటుండడంతో పొలాలు ఆరడం లేదు. పంట కోతకు వచ్చిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎత్తిపోతల పైపులైన్ నుంచి
లీకవుతున్న నీరు
బురదనీటితో పొలాలు..
పంటల సాగుకు ఇబ్బందులు
పడుతున్న రైతులు
కొత్త పైపులైన్ వేస్తేనే
శాశ్వత పరిష్కారం

నీరు వృథా రైతు వ్యథ