
ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆర్బాస్ ఖాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఈవో దేవీసింగ్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మండల కేంద్రంలో మాట్లాడారు. ప్రయివేట్ పాఠశాల్లో ఇష్టానుసారంగా పుస్తకాలు, టై, బెల్టుతో వ్యాపారం చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. సరైన అర్హత లేని వారితో విద్యా బోధన చేపిస్తున్నారన్నారు. విద్యార్థులకు ఆడుకోవ డానికి సరైన ఆట స్థలం కూడా లేదన్నారు. అధికారులు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నేతలు శేఖర్, ప్రసన్న, శివ తదితరులు పాల్గొన్నారు.