
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మాచారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం పాల్వంచ మండలంలోని భవానిపేట్ తండా, సింగరాయపల్లి, ఇసాయిపేట, మంథని దేవునిపల్లి, ఎల్పుగొండ, వాడి గ్రామాలల్లో పర్యటించి తన సొంత నిధులతో నిర్మించిన కుల సంఘ భవనాలు, ఆలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పోసు అనిల్, నాయకులు పండ్ల ప్రవీణ్, సురేష్, వెంకటరెడ్డి, బాలరాజు, నరసింహాచారి, శ్రీనివాసాచారి, నరేష్, నారాయణ, బాల్ నర్సు ఉన్నారు.