
‘పార్టీకి సేవ చేసిన వారికి తగిన గుర్తింపు’
భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు సేవ చేసిన వారికి తగిన గుర్తింపును ఇచ్చి పదవులను కట్టబెడుతుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. గురువారం పీసీసీ కార్యదర్శిగా నియమితులైన ఇంద్రకరణ్‌రెడ్డిని ఆయన భిక్కనూరు సమీపంలోని ఫామ్‌హౌస్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా షెట్కార్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, యూత్ కాంగ్రెస్ నేత ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, నేతలు బల్యాల సుదర్శన్, కుంట లింగారెడ్డి, భీంరెడ్డి, బాగారెడ్డి పాల్గొన్నారు.