కారు బోల్తా: ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఐదుగురికి గాయాలు

Jun 27 2025 4:15 AM | Updated on Jun 27 2025 4:15 AM

కారు బోల్తా: ఐదుగురికి గాయాలు

కారు బోల్తా: ఐదుగురికి గాయాలు

రెంజల్‌(బోధన్‌): మండలంలోని సాటాపూర్‌ రహదారిపై కారు బోల్తా పడటంతో డ్రైవర్‌తోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై చంద్రమోహన్‌ తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్‌ నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు బుధవారం కారులో సాటాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం అనంతరం అదే రాత్రి తిరిగి నగరానికి బయలుదేరారు. సాటాపూర్‌ రహదారిపై వారి కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన గల గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ సర్పరాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement