
మతిస్థిమితం లేని యువకుడి వీరంగం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ సంతోష్ అనే యువకు డు మతిస్థిమితం కోల్పోయి గత కొద్ది రోజులుగా తండాలో వీరంగం సృష్టిస్తున్నాడు. ఈక్రమంలో గు రువారం అతడికి ఎదురువచ్చిన తండావాసులను రాళ్లతో, కర్రలతో కొడుతూ అసభ్యకరమైన మాటల తో దూషించాడు. తండాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో కి చొరబడి ఫర్నిచర్, టీవీ, వంటపాత్రలు, రెండు బైక్‌లను ధ్వంసం చేశాడు. దీంతో సుమారు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు తెలి పారు. సంతోష్ చేష్టలతో విసిగిపోయిన తండావాసులు అతడిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో సైతం రాళ్లు రువ్వుతూ అతడు దాడి చేశాడు. వెంటనే సీఐ రవీందర్‌నాయక్ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆ స్పత్రి వైద్యులను పిలిపించి మత్తు ఇంజక్షన్ ఇప్పించారు. గంట తర్వాత సంతోష్ అరవడం మానేశాడు. అనంతరం వైద్య చికిత్సల నిమిత్తం అతడిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.
బాబాయ్ మృతితో కుంగిపోయి..
సంతోష్ వింత చేష్టలతో ఎల్లారెడ్డి సీఐ అతడిపై ఆరా తీశారు. సంతోష్ బాబాయి అయిన దేవసోత్ పకీరాను గత నెల 24న కన్న కొడుకు ప్రకాష్ గొడ్డలితో నరికి చంపాడు. పకీరా మృతి చెందిన సమయంలో అక్కడే ఉన్న సంతోష్ ఇంట్లో పడిన రక్తాన్ని తొలగించి శుభ్రం చేశాడు. అప్పటి నుంచి సంతోష్ మానసికంగా కుంగిపోయి మతిస్థిమితం కోల్పోయినట్లు తండావాసులు తెలిపారు. మంచి భవిష్యత్ ఉన్న యువకుడు మతిస్థిమితం కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.