బాన్సువాడ : ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే కుమ్మర్ల తొలి బోనం జాతరకు సంబంధించిన కరపత్రాలను జిల్లా శాలివాహన కుమ్మర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు దుర్కి నారాయణ బుధవారం బాన్సువాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆషాడమాసం పురస్కరించుకుని కనకాల కట్టమైశమ్మ గుడి లోయర్ ట్యాంకు బండ్ హైదరాబాద్‌లో నిర్వహించే జాతరను విజయవంతం చేయాలని కోరారు. కుమ్మరులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, మండల అధ్యక్షులు దత్తు, నాయకులు పాపయ్య, మోహన్, సుభాష్, తదితరులున్నారు.
సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలి
దోమకొండ: కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మండలానికి చెందిన పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తీగల తీర్మల్ గౌడ్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో వారు మాట్లాడారు. మాచారెడ్డి మండల కేంద్రంలో జరిగే నియోజకవర్గ స్థాయి సమావేశానికి అతిథులుగా ఏఐసీసీ ఇంచార్జి విశ్వనాథన్, మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ హాజరవుతారని తెలిపారు. నేతలు నర్సారెడ్డి, శంకర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన మెటీరియల్ వాడాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): నాణ్యమైన మెటీరియల్‌తో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి సూచించారు. బుధవారం చా వుని తండాలో నూతన జీపీ భవనానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో నేతలు శామప్ప పటేల్, గోపాల్ పాల్గొన్నారు.
‘కంటికి అభివృద్ధి కనపడకపోవడం బాధాకరం’
బిచ్కుంద(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని, అభివృద్ధి బీజేపీ నాయకుల కంటికి కనపడకపోవడం బాధాకరమని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం బిచ్కుంద ఏఎంసీ కార్యాలయం సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉంది.. జిల్లా, నియోజకవర్గ నాయకులు జుక్కల్ అభివృద్ధి కోసం చిల్లి గవ్వ నిధులు ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షం నాయకులు కండ్లు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. నాయకులు జీవన్, లజయ్ పటేల్, నారాయణ, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

కుమ్మర్ల తొలి బోనం జాతర కరపత్రాల ఆవిష్కరణ