
మాదకద్రవ్యాల నివారణకు సమష్టి కృషి చేయాలి
బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి
బాన్సువాడ: మాదక ద్రవ్యాల నివారణకు సమష్టి కృషి చేయాలని బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐ అశోక్, తహసీల్దార్ వరప్రసాద్, ఉపాధ్యాయులు నరహరి తదితరులున్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఎల్లారెడ్డి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. బుధవారం ఎల్లారెడ్డిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసులు అంబేడ్కర్ చౌరస్తా నుంచి బాలాగౌడ్ ఫంక్షణ్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. సీఐ రవీందర్‌నాయక్, ఎస్సై మహేష్, ఎంఈవో రాజులు, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేట మోడల్‌స్కూల్‌లో బుధవారం మాదకద్రవ్యాల నిషేధంపై నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీంతోపాటు మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులను పోలీసులు శాలువాతో సత్కరించి వారికి బహుమతులను అందజేశారు. మోడల్‌స్కూల్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జోత్స్యరాణి, కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నివారణకు సమష్టి కృషి చేయాలి

మాదకద్రవ్యాల నివారణకు సమష్టి కృషి చేయాలి