
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
బాన్సువాడ రూరల్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని బాన్సువాడ డీఎల్‌పీవో వెంకట సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన కోనాపూర్‌లో పర్యటించారు. గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి కార్యదర్శి భరత్‌కుమార్‌ను అభినందించారు.
తాగునీరు కలుషితం కాకుండా
జాగ్రత్తలు తీసుకోవాలి
దోమకొండ: తాగునీరు కలుషితం కాకుండా గ్రామాల్లో పంచాయితీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సూచించారు. ముత్యంపేట గ్రామపంచాయతీలో బుధవారం తాగునీటి పైపులు చెడిపోగా మరమ్మతులు చేయించి మాట్లాడారు. గ్రామంలోని పలు వాటర్‌ట్యాంకులు, పైపులైన్‌లను పరిశీలించారు.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
బాన్సువాడ రూరల్: సీజన్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హన్మాజీపేట్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఇమ్రాన్ సూచించారు. బుధవారం హన్మాజీపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీజనల్ వ్యాఽధులపై అవగాహన కల్పించారు. అన్నం తినే ముందు, మల మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచాలి

పరిసరాలను శుభ్రంగా ఉంచాలి