
క్రైం కార్నర్
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
వర్ని: మండలంలోని జాకోరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కమ్మరి సతీష్ (40) ఫొటో గ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున అతడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సతీష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లింగంపేట మండలంలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మున్నూరుపల్లి సాయిలు–అనసుజ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు మున్నూరుపల్లి అశోక్(22) ఇంటర్ వరకు చదివి, గొర్లను కాస్తున్నాడు. కొంత కాలంగా దుబాయి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పగా వారు వద్దని వారించారు. పెళ్లి చేసుకొమ్మని చెప్పగా తర్వాత చేసుకుంటానన్నాడు. మనస్తాపం చెందిన అశోక్ మంగళవారం ఉదయం తెల్లవారుజామున దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఖతార్‌లో ఆర్మూర్‌వాసి అదృశ్యం
ఆర్మూర్: పట్టణంలోని కాశీ హనుమాన్ గల్లీకి చెందిన కా నూర్ నాగరాజు ఖతార్‌లో అ దృశ్యం అయ్యాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపా రు. అతడి ఆచూకీ కనుగొనా లని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణి లో తండ్రి కానూర్ నారాయణ వినతిపత్రం సమ ర్పించారు. ఆరు నెలల క్రితం నాగరాజు ఖతార్‌కు వెళ్లి విధుల్లో చేరాడని, గత నెల 26 నుంచి ఫోన్‌లో అందుబాటులో లేడని అతడి తండ్రి ఆందోళన వ్య క్తం చేశారు. ఏదో క్రిమినల్ కేసు విచారణ కోసం పో లీసుల అదుపులో ఉన్నట్లు అనుమానంగా ఉందంటూ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్మూ ర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి చొరవ చూపాలని వారికి అభ్యర్థనలు పంపారు. ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను సందర్శించిన జీఏడీ ఎన్నారై విభాగం అధికారులు శ్రీనివాసరెడ్డి, చిట్టిబాబులకు నారాయణ తన గోడును వెళ్లబోసుకున్నారు.
చికిత్స పొందుతూ ఒకరి మృతి
భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన చెట్లపల్లి రవి (42) ఈనెల 14న తాటికొండ అశోక్ అనే వ్యక్తికి జ్వరం రావడంతో చికిత్స కోసం అతడిని బైక్‌పై ఎక్కించుకొని భిక్కనూరు ప్రభుత్వాస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో వారి బైక్‌ను కామారెడ్డి వైపు నుంచి భిక్కనూరుకు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ రవి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.