చరిత్రకు సాక్షిగా నిలిచిన శివాలయం | - | Sakshi
Sakshi News home page

చరిత్రకు సాక్షిగా నిలిచిన శివాలయం

Jun 25 2025 1:21 AM | Updated on Jun 25 2025 1:21 AM

చరిత్

చరిత్రకు సాక్షిగా నిలిచిన శివాలయం

మీకు తెలుసా?

ట్టణంలోని అపురూపమైన ఏకచక్రేశ్వర శివాలయం చరిత్ర కు సాక్షిగా నిలుస్తోంది. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ జిల్లాలోనే విశిష్టత కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

● 13వ శతాబ్దంలో కాకతీయులు బోధన్‌ ప్రాంతాన్ని పాలించిన కా లంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినట్లు శివలీలామృతం అనే ప్రాచీన సంస్కృత గ్రంథంలో పేర్కొనబడింది.

● కాకతీయ పాలనలో ముష్కరులు దక్షిణ భారతదేశ దండయాత్రకు పూనుకున్న సమయంలో ఆలయాన్ని రక్షించుకునేందుకు ఈ ప్రాంతం వారు మట్టితో ఆలయాన్ని కప్పివేసి ఉంటారని ప్రచారంలో ఉంది.

● 1959లో గుంటూరు వాస్తవ్యుడైన రామిరెడ్డి అనే వ్యక్తి బోధన్‌లో స్థిరపడటానికి ఒక మట్టికోటను చదును చేస్తుండగా (పుష్య బహుళ అమావాస్య రోజు) ఈ ఆలయం బయల్పడినట్లు బోధన్‌ పూర్వీకులు చెబుతుంటారు.

● సముద్రంలో అరుదుగా లభించే ప్రత్యేకమైన సాలాగ్రామము శిలతో చేయబడిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠాపన చేయడం అత్యంత విశేషమైనది.

● ఆలయంలోని శివలింగానికి నిత్యం పూజలు చేసేవారికీ ధనధాన్యాలకు లోటు ఉండదని శివపురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతంలో ప్రజలకు తిండికి, నీటికి కొదవుండదు.

● ఆలయ అభివృద్ధి కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో శివరాత్రి, కార్తీకమాసం, శ్రావణమాసంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలతోపాటు, భక్తులకు ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నారు.

– బోధన్‌రూరల్‌

చరిత్రకు సాక్షిగా నిలిచిన శివాలయం1
1/1

చరిత్రకు సాక్షిగా నిలిచిన శివాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement