
సర్వర్ డౌన్.. నిలిచిన రిజిస్ట్రేషన్లు
లింగంపేట(ఎల్లారెడ్డి): సర్వర్ డౌన్‌తో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. దాంతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి వచ్చిన రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తహసీల్ కార్యాలయం వద్ద నిరీక్షించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూభారతి చట్టం అమలు కోసం లింగంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం విదితమే. ఇందులో భాగంగా రెండు నెలల పాటు రిజిస్ట్రేషన్లు అధికారులు నిలిపివేశారు. జూన్ 3 నుంచి తిరిగి రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు.
గత 15 రోజులగా ఆన్‌లైన్‌లో అంతరాయం ఏర్పడుతుండడంతో రైతులు ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్ కారణంగా రోజుకు 4 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయమై తహసిల్దార్‌ను వివరణ కోరగా.. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ డౌన్ సమస్య ఉందన్నారు.