
ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేరుస్తా
మాచారెడ్డి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఒ క్కొక్కటిగా నెరవేరుస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రత్నగిరిపల్లి, గణ్‌పూర్, కాకులగుట్ట తండా, లచ్చాపేట గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తన సొంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు మూడేళ్లలో కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మాచారెడ్డి మండల అధ్యక్షుడు బూస సురేష్, జిల్లా సీనియర్ నాయకులు పొన్నాల వెంకటరెడ్డి, మండల ఇన్‌చార్జి పండ్ల ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, నాయకులు భరత్ యాదవ్, ఓదేలు, రమేష్, కిషన్ గౌడ్, తదితరులున్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్