
జవాబుదారీగా విధులు నిర్వర్తించాలి
కామారెడ్డి క్రైం: అధికారులు జవాబుదారీగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 151 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు, ఇబుల్ బెడ్‌రూం ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. విచారణ జరిపి దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో తీసుకున్న చర్యల సమాచారాన్ని దరఖాస్తుదారునికి తెలియపరచాలని సూచించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్