నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామశివారులో సోమవారం ఉదయం మోపెడ్ వాహనం చెట్టును ఢీకొని మహమ్మద్ గని(36) అనే వ్యక్తి మృతి చెందాడు. మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన గని పాన్‌షాపు డబ్బా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెట్రోల్ కోసం మోపెడ్‌పై వెళ్తున్న గని సుల్తాన్‌నగర్ శివారులో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొన్నాడు. తలపగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సైనాజీ, తల్లి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ కేసులో ఒకరి అరెస్టు
నిజాంసాగర్(జుక్కల్): చోరీ కేసులో ఒకరి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈ నెల 8 మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న మన్నె అంజవ్వ ఇంట్లో అత్రం ప్రశాంత్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ద్విచక్రవాహన చోరీలో..
నిజాంసాగర్(జుక్కల్): మాగి గ్రామంలో గత నెల 28న నిర్వహించిన కుస్తీ పోటీల ప్రాంతం నుంచి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడు రవిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన పొట్లోళ్ల సాయిరాం మాగి గ్రామంలో కుస్తీ పోటీలు తిలకించేందుకు పల్సర్ బైక్‌పై వచ్చాడు. వాహనాన్ని పార్కింగ్ చేసి, కుస్తీపోటీలను తిలకించాడు. అనంతరం వెళ్లి చూడగా బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్‌పై వెళ్తున్న రవిని పట్టుకొని విచారించామని ఎస్సై తెలిపారు. బైక్‌ను తానే దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
రామారెడ్డి: మండలంలోని పోసానిపేట గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై రాజారాం తెలిపిన వివరాల ప్రకారం.. పోసానిపేట గ్రామానికి చెందిన బచ్చు బలరాం ఆదివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం తిరిగి ఇంటికి రాగా, సామగ్రి చిందరవందరగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు మూడు తులాల బంగారం, 15 తులాల వెండిని అపహరించినట్లు ఎస్సై రాజారాం తెలిపారు.
బస్టాండ్ ప్రహరీని ఢీకొట్టిన బస్సు
● ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే ఘటన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందే అనుకోని ఘటన ఏర్పడింది. మెదక్ డిపోకు చెందిన డీలక్స్ బస్సు సోమవారం బస్టాండ్‌లో రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనక వైపు ఉన్న ప్రహరీని తాకడంతో కూలిపోయింది. సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభానికి బస్సు తగిలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు ఆందోళన చెందారు. కాగా, మంగళవారం మంత్రి చేతుల మీదుగా బస్టాండ్ ప్రారంభోత్సవం ఉండడంతో సిబ్బంది కూలిన ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు.
చెట్టును ఢీకొన్న మోపెడ్.. ఒకరి మృతి
చెట్టును ఢీకొన్న మోపెడ్.. ఒకరి మృతి
చెట్టును ఢీకొన్న మోపెడ్.. ఒకరి మృతి