
మహిళా అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ స్టేజీ వద్ద గల మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న హిస్టరీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను బోధించటానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 వరకు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు. 26న డెమో, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.
కుల బహిష్కరణకు గురైన వ్యక్తి నిరాహార దీక్ష
బాన్సువాడ: బాన్సువాడ పట్టణానికి చెందిన జర్నలిస్టు మేకల సాయిలు తనను కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సోమవారం ఎస్సీ వార్డులో గల శ్రీనివాస కల్యాణ మండపం వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. గ్రామాని చెందిన పానాదిని ఒక వ్యక్తి కబ్జా చేసి అమ్మడానికి ప్రయత్నించగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో కుల సంఘం సభ్యులతో కలిసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చర్యలు తీసుకునేంత వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానన్నారు.
డబుల్ ఇళ్ల బిల్లుల కోసం పోలీసులకు ఫిర్యాదు
నిజాంసాగర్(జుక్కల్): డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ బిల్లులు ఇప్పించాలని మహమ్మద్ నగర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సోమవారం ఎస్సై శివకుమార్‌కు ఫిర్యాదు చేశారు. గిర్ని తండా, దూప్‌సింగ్ తండా, తెల్గాపూర్ గ్రామాల్లోని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కావడంతో ఇళ్లు నిర్మించామని తెలిపారు. రెండు విడతల్లో బిల్లులు ఇచ్చారని, మూడో విడత బిల్లులు రావాల్సి ఉందని, కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తు న్నాడని ఆరోపించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్‌కు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసినా తమకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం లేదని ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు.

మహిళా అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం