‘పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి’

Jun 24 2025 3:49 AM | Updated on Jun 24 2025 3:49 AM

‘పిల్

‘పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి’

కామారెడ్డి అర్బన్‌ : చిన్ననాటి నుంచే క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. హకీంపేట, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ తెలంగాణ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశా ల కోసం సో మవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ని ర్వహించారు. క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోటీల ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో మొక్కను నా టారు. విద్యార్థులకు వివిధ క్రీడలు నిర్వహించి 10 మంది చొప్పున బాలబాలికలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయిలో వచ్చేనెల 2న నిర్వహించే ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపేవారు ఆ యా క్రీడా పాఠశాలల్లో ప్రవేశం పొందనున్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన శాఖ అధి కారి జగన్నాథన్‌, స్కూ ల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి హీరాలాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం

కామారెడ్డి క్రైం: రక్తదానం ప్రాణదానంతో సమాన మని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. ఎస్‌బీఐ 71 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డిలోని ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 100 మందికిపైగా ఎస్‌బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఓ నిండు ప్రాణాన్ని కాపాడినవారం అవుతామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ రాజన్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి’1
1/1

‘పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement