
‘పేద విద్యార్థులకు వరంలా గురుకులాలు’
బాన్సువాడ : గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలు వరంలా మారాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బీర్కూర్ మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం రూ. 26 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరై ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులను అందించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్యామల, ఆర్‌సీవో సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ లత, పాఠశాల ప్రిన్సిపల్ శివకుమార్, నాయకులు యామ రాములు, శశికాంత్, శ్రీనివాస్‌గౌడ్, బస్వరాజ్, రఘు, బోయిని శంకర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ..
బాన్సువాడ నియోజకవర్గంలోని పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాన్సువాడలో సోమవారం పోచారం శ్రీనివాస్‌రెడ్డి అందించారు. 107 మందికి రూ. 35.41 లక్షల విలువ చేసే చెక్కులను అందించినట్లు తెలిపారు.