‘సిట్‌’ నుంచి కాంగ్రెస్‌ నేతకు పిలుపు | - | Sakshi
Sakshi News home page

‘సిట్‌’ నుంచి కాంగ్రెస్‌ నేతకు పిలుపు

Jun 23 2025 6:06 AM | Updated on Jun 23 2025 6:06 AM

‘సిట్‌’ నుంచి కాంగ్రెస్‌ నేతకు పిలుపు

‘సిట్‌’ నుంచి కాంగ్రెస్‌ నేతకు పిలుపు

కామారెడ్డి క్రైం : రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కామారెడ్డిలోనూ కలకలం రేపుతోంది. న్యాయవాది, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాంగ్మూలం కోసం హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి రావాలంటూ సిట్‌ ఆయనకు ఆదివారం ఫోన్‌ కాల్‌ ద్వారా తెలిపింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాజగోపాల్‌రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత ఉంది. ఆయన షబ్బీర్‌ అలీకి నమ్మకమైన వ్యక్తి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రచార బాధ్యతలను ఎక్కువగా ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి చూసుకున్నారు. రాజగోపాల్‌ రెడ్డి సైతం కొండల్‌రెడ్డి వెంటే ఉంటూ పార్టీ ప్రచార, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారు. అందుకే ఆయన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేసి ఉంటారని తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డితోపాటు జిల్లాలోని పలువురి ఫోన్‌లు సైతం ట్యాపింగ్‌కు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని కొందరు అధికారులు, నేతలు అందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..

గత అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి నియోజకవర్గంనుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పోటీ చేశారు. దీంతో కామారెడ్డి ఎన్నికల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇద్దరు ముఖ్య నేతలూ కామారెడ్డిలో పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తన ప్రత్యర్థి వర్గం కదలికలను తెలుసుకోవడానికి కేసీఆర్‌ వర్గం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఓ ట్యాపింగ్‌ బృందాన్ని కామారెడ్డికి పంపి ఓ హోటల్‌లో అడ్డా వేసి ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను టార్గెట్‌ చేశారని కేసు ప్రారంభంలో జరిగిన విచారణలో తేలింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నాయకుల కదలికలపై, ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరే విధంగానే ఎన్నికల సమయంలో పలు ఘటనలు సైతం జరిగాయి. కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల్లో ఒకరైన గూడెం శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యాపార కార్యాలయంలో జరిపిన దాడుల్లో రూ. 58 లక్షలు పట్టుబడ్డాయి. దేవునిపల్లి ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి నివాసం ఉన్న ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఆయనను గృహ నిర్భంధం కూడా చేశారు. అప్పటి మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ ఇంటిపైనా పోలీసులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో వివరాలు తెలుసుకునే దాడులు చేశారని తెలుస్తోంది.

కామారెడ్డిలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిన తీ రుపై విచారణ జరిపిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు సిట్‌కు నివేదిక సమర్పించాయి. తాజాగా కేసులో పురోగతి రావడంతో ఇప్పుడు ట్యా పింగ్‌ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట కు వస్తున్నాయి. సిట్‌ నుంచి ఇంకా ఎంత మందికి ఫోన్‌కాల్‌ వస్తుందోనన్న అంశంపై పట్టణంలో చర్చ నడుస్తోంది.

వాంగ్మూలం ఇవ్వాలంటూ

ఫోన్‌ కాల్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో

బాధితుడిగా రాజగోపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement