
ప్రారంభానికి ముస్తాబైన ఆర్టీసీ బస్టాండ్
ఎల్లారెడ్డి: పట్టణంలో మున్సిపల్ నిధులతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని మధ్యలో నిలిచిపోయిన బస్టాండ్ నిర్మాణ పనులకు ప్రత్యేకంగా నిధులను తీసుకుని వచ్చి పనులు పూర్తి కావడానికి సహకరించారు. దీంతో ఎల్లారెడ్డి ప్రజల కల సాకారమైంది. బస్టాండ్‌కు వచ్చిన వారికి గతంలో ఇబ్బందులు తలెత్తడంతో నూతన బస్టాండ్‌ను మున్సిపల్ నిధులతో నిర్మించారు. ఈనెల 24న మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బస్టాండ్‌ను ప్రారంభింపజేసి ప్రజలకు అంకింతం చేయనున్నారు.