
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
బీబీపేట: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల కోసం గ్రంథాలయంలో స్టడీ మెటీరియళ్లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం గ్రంథాలయాన్ని కేటాయించడం అనేది అవాస్తవమని, దానికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అన్నారు. సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని అన్నారు. గ్రంథాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కళాశాల కోసం కేటాయించేది లేదని స్పష్టం చేశారు. కళాశాల కోసం మరో భవనాన్ని చూస్తున్నారని అన్నారు.