
ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి
కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి/బాన్సువాడ/కామారెడ్డి అర్బన్/కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో శనివారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా మండలాల్లో జయశంకర్ విగ్రహం, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామారెడ్డిలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జయశంకర్, తెలంగాణ పాటల పొద్దు గూడ అంజయ్యల వర్ధంతిల సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. బీఆర్‌ఎస్ నాయకులు, మలిదశ ఉద్యమకారులు, తెరవే ప్రతినిధులు, స్వర్ణకార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి

ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి