
డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామశివారు కోతి దేవుడి ఆలయం వద్ద శనివా రం అదుపుతప్పిన డీసీఎం డివైడర్‌ను ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు పాత ఇనుప సామగ్రితో వెళుతున్న డీసీఎం నడిపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎం ముందుభాగం ధ్వంసం కావడంతోపాటు టైరు ఊడిపోయింది.దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పోలీసులు డీసీఎంను పక్కకు తొలగించారు.ప్రమాదానికి సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయలేదని డిచ్‌పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు.
బాలుడి అప్పగింత
రుద్రూర్ : తప్పిపోయిన బాలుడిని రుద్రూర్ మండల కేంద్రంలో పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలోని కోటగల్లికి చెందిన షేక్ ఫర్హాన్ (9) అనే బాలుడు శుక్రవారం తప్పిపోయి రుద్రూర్ బస్టాండ్ పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకొని బాన్సువాడ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులు బాలుడిని అప్పగించారు.