మీకు తెలుసా?
దోమకొండ గడికోటలోని మహదేవుని ఆలయ నిర్మాణానికి అప్పట్లో వరంగల్ సంస్థానంను పరిపాలించిన రాణి రుద్రమదేవి వచ్చినట్లు శిలాఫలకం ఉంది. ప్రస్తుతం ఏదైనా కార్యక్రమాన్ని మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభించినప్పుడు ఏ విధంగానైతే శిలా ఫలకాలు ఏర్పాటు చేస్తున్నారో ఆ రోజుల్లో సైతం ఆమె ఆలయ నిర్మాణానికి వచ్చినప్పుడు శిలాఫలకం ఏర్పాటు చేసినట్లు పురావస్తుశాఖ ప్రతినిధులు గుర్తించారు. వరంగల్‌లోని వేయి స్థంభాల ఆలయాన్ని పోలిన విధంగా అదే శిల్పాకళా నైపుణ్యంతో ఇక్కడి మహదేవుని ఆలయ నిర్మాణం ఉంటుంది.
–దోమకొండ
వేయి స్తంభాల ఆలయాన్ని పోలిన ఆలయం


