అధికారం వైపే..! | - | Sakshi
Sakshi News home page

అధికారం వైపే..!

Dec 20 2025 7:40 AM | Updated on Dec 20 2025 7:40 AM

అధికా

అధికారం వైపే..!

2019లో బీఆర్‌ఎస్‌.. ప్రతిపక్షాలకు..

న్యూస్‌రీల్‌

పంచాయతీల్లో అభివృద్ధి కోసం అధికార పార్టీకి పట్టం

అప్పుడు బీఆర్‌ఎస్‌కు..

ఇప్పుడు కాంగ్రెస్‌కు..

శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

– 11లో u

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో 532 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 339 గ్రామాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులే విజయం సాధించారు. 97 గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, 28 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు గెలవగా.. 68 చోట్ల స్వతంత్రులు, కాంగ్రెస్‌ రెబల్స్‌ గెలిచారు. ఎన్నికల తర్వాత రెబల్స్‌తో పాటు స్వతంత్రులు కొందరు ఇప్పటికే అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు.

2019 లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటర్లు మద్దతుగా నిలిచారు. అప్పట్లో 525 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 369 గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. 121 గ్రామాల్లో కాంగ్రెస్‌, నాలుగు గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు, 31 గ్రామాల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఎన్నికల తర్వాత చాలా మంది సర్పంచ్‌లు గులాబీ కండువా కప్పుకున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా గౌరవప్రదమైన స్థానాలు పొందాయి. జిల్లాలో ఈసారి జరిగిన ఎన్నికల్లో 97 గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, 28 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. ప్రధానంగా పెద్ద పంచాయతీలుగా ఉన్న మండల కేంద్రాల్లో చాలాచోట్ల ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించాయి. ఐదు మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు మరో నాలుగు చోట్ల ఆ పార్టీ రెబల్స్‌ విజయం సాధించారు. ఆరు మండల కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌, ఒకచోట బీజేపీ మద్దతుదారులు, మిగిలినచోట్ల స్వతంత్రులు గెలుపొందారు.

తగ్గిన ఏకగ్రీవాలు..

రాజకీయాలపై ఆసక్తి పెరగడంతో ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఏకగ్రీవాలు తగ్గుముఖం పడుతున్నాయి. 2019 లో 119 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈసారికి వచ్చేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 81 గ్రామాల్లో మాత్రమే సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పుడైనా, ఇప్పుడైనా ఏకగ్రీవాల్లో తొంభై శాతానికిపైగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు చక్రం తిప్పుతుండడంతో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా అధికార పార్టీకి చెందిన నేతలను సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు.

అధికార బలముంటే...

అధికారంలో ఉన్న పార్టీకి పట్టం కడితే అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో చాలా గ్రామాల్లో ప్రజలు అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపిస్తున్నారు. దీనికి తోడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన వారిని గెలిపించుకుని బలం చాటుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతారు. దీంతో ఆ పార్టీ మద్దతుదారులు సులువుగా గెలవగలుగుతున్నారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీల్లో అయితే అధికార పార్టీ వారే ఎక్కువగా ఉంటున్నారు.

పల్లె పోరులో ప్రజలు ‘అధికార’ పార్టీకి అనుకూల తీర్పు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులు గెలిస్తే గ్రామానికి ఎక్కువ నిధులు వస్తాయని ఓటర్లు ఆశిస్తున్నారు. దీంతో మెజారిటీ పంచాయతీలు అధికార పార్టీ ఖాతాలో చేరుతున్నాయి.

అధికారం వైపే..!1
1/2

అధికారం వైపే..!

అధికారం వైపే..!2
2/2

అధికారం వైపే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement