ప్రజలకు సేవ చేయాలి
● బీజేపీ జిల్లా ఇన్‌చార్జి విక్రమ్‌రెడ్డి
● పలువురు సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సన్మానం
లింగంపేట : పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలు ప్రజలకు మరింత సేవ చేయాలని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి పట్లోళ్ల విక్రమ్‌రెడ్డి సూచించారు. శుక్రవారం లింగంపేటలోని జీఎన్‌ఆర్ గార్డెన్‌లో బీజేపీ నుంచి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా గెలిచిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలన, ప్రజలకు సేవ అందించాలని సూచించారు. కార్యకర్తలు మరింత శ్రమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి చెందినవారు 21 మంది సర్పంచ్‌లుగా, 18 మంది ఉపసర్పంచ్‌లుగా, 102 మంది వార్డు సభ్యులుగా విజయం సాధించారని ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి తెలిపారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ బీజేపీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. గెలుపు, ఓటములు సహజమని, ఓడినవారు నిరాశ చెందవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, నాయకులు రామ్‌రెడ్డి, బాపురెడ్డి, రాజమోహన్‌రెడ్డి, రవీందర్‌రావు, లింగారావు, మహారాజుల మురళి, దత్తురాం, రాంచంద్రం, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.


