‘సర్పంచ్ పదవి నుంచి తొలగించాలి’
కామారెడ్డి టౌన్ : రాజంపేట మండలం అన్నారం సర్పంచ్ రవీందర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పంచాయతీ ఎన్నికలలో పోటీ చేశారని, ఆయనను పదవినుంచి తప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. రవీందర్ నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడని గ్రామస్తులు ఆరోపించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు.
సీఎం ఓవర్సీస్ పథకానికి
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: విదేశాల్లో ఉన్నత విద్య అ భ్యసించే మైనారిటీల నుంచి సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి జయరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు జనవరి 19వ తేదీ వరకు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 80969 73346 నంబర్‌లో గాని కలెక్టరేట్‌లోని 222 గదిలోని తమ కార్యాలయంలో గాని సంప్రదించాలన్నారు.
‘గణిత ప్రతిభా పరీక్షను విజయవంతం చేయాలి’
కామారెడ్డి టౌన్ : శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లాలో నిర్వహించే మండల స్థాయి గణిత పరీక్షను విజయవంతం చేయాలని తెలంగా ణ గణిత ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాలో ని అన్ని మండల కేంద్రాలలోని ఉన్నత పాఠశాలలో పరీక్ష నిర్వహించాలని ఎంఈవోలు, హెచ్‌ఎంలు, గణిత ఉపాధ్యాయులను కోరా రు. కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రామారావు, ఆర్థిక కార్యదర్శి నరేందర్, ప్రతినిధు లు సత్యం, చిరంజీవి, వెంకటి, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గణాంకాధికారికి సన్మానం
కామారెడ్డి అర్బన్: జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖలో డిప్యూటీ ఎస్‌వోగా పనిచేస్తూ ఎస్‌వోగా ప్రమోషన్ పొందిన లక్ష్మణ్‌ను టీఎన్జీవోస్ ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రతినిధులు శివకుమార్, చక్రధర్, దేవరాజు పాల్గొన్నారు.
‘యూరియా బుకింగ్‌కు యాప్’
భిక్కనూరు: రైతుల సౌలభ్యం కోసం వ్యవసాయ శాఖ యూరియా బుకింగ్ మొబైల్ యాప్‌ను తీసుకువచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తిప్పాపూర్ సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో సొసైటీ, వ్యవసాయ అధికారులు, రైతులకు యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల లభ్యత వివరాలు తెలుసుకునేందుకు యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అపర్ణ, సింగిల్ విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఏఈవోలు వినోద్ కుమార్, లత, రజిత, సొసైటీ సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నంబర్ ప్లేట్ సక్రమంగా లేని
వాహనాలపై ఫోకస్
కామారెడ్డి క్రైం: నంబర్ ప్లేట్ సక్రమంగా లే ని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పట్టణ ట్రాఫిక్ ఎస్సై మహేశ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, సిరిసిల్ల రోడ్, రా మారెడ్డి చౌరస్తా తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను విస్తృతంగా చేపట్టారు. నంబర్ ప్లేట్ లేకుండా, ట్యాంపరింగ్ చేసి నడు పుతున్న 10కి పైగా బైక్‌లు, ఆటోలను గుర్తించారు. చెడిపోయిన నంబర్ ప్లేట్‌లను తొల గించి వాటి స్థానంలో కొత్తవి వేయించారు. మరోసారి నంబర్ ప్లేట్ సక్రమంగా లేకుండా పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని వాహనదారులను హెచ్చరించారు.


