వాహనాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

వాహనాల తనిఖీ

Jun 15 2025 7:28 AM | Updated on Jun 15 2025 7:28 AM

వాహనా

వాహనాల తనిఖీ

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని అచ్చంపేట శివారులోగల నాందేడ్‌–సంగారెడ్డి జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను శనివారం ఎస్సై శివకుమార్‌, సిబ్బంది తనిఖీ చేశారు. వాహనదారులకు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేనివారికి జరిమానాలు విధించినట్లు ఎస్సై తెలిపారు.

బురద మట్టిలో ఇరుక్కున్న లారీ

దోమకొండ: మండలంలోని ముత్యంపేట గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం ఓ లారీ బురదలో ఇరుక్కుపోగా నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి మండలం క్యాసంపల్లి నుంచి దోమకొండ వరకు బీటీ రోడ్డు పనులకు నిధులు మంజూరు కాగా, సదరు కాంట్రాక్టర్‌ ముత్యంపేట వరకు పను లు పూర్తి చేసి వదిలేశాడు. ముత్యంపేట నుంచి దోమకొండ వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టిని పోశారు. కాగా కొందరు రోడ్డు మధ్య లో వర్షం నీరు నిలుస్తుందని మట్టిని పోయించినట్లు తెలిసింది. వర్షానికి మట్టి పూర్తిగా బురదగా మారడంతో వాహనాలు బురదలో ఇరుక్కుంటున్నాయని గ్రామస్తులు తెలిపారు. దోమకొండ నుంచి కామారెడ్డికి లోడ్‌తో వెళుతున్న లారీ బురదలో ఇరుక్కొగా ఆర్టీసీ బస్సు లు కూడా ముత్యంపేట నుంచి తిరిగి కామారెడ్డికి వైపుకు వెళ్లిపొయినట్లు వారు తెలిపారు. లారీని చివరకు జేసీబీ సాయంతో తీశారు.

రోడ్డుపై కూలిన మర్రిచెట్టు

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై పెద్ద మర్రి వృక్షం నేల కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో గల ప్రధాన రహదారిపై పెద్ద మర్రిచెట్టు కూలిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్‌ జేసీబీతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు.

పనులను వెంటనే ప్రారంభించాలి

బాన్సువాడ రూరల్‌: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి లభించిన లబ్ధిదారులందరూ వెంటనే ఇంటి పనులు ప్రారంభించాలని జక్కల్‌దాని తండా కాంగ్రెస్‌ నాయకులు బన్సీనాయక్‌, రవి అన్నారు. ఈసందర్భంగా గ్రామంలో వారు శనివారం లబ్ధిదారులతో కలిసి ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసి భూమిపూజ చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని

కలిసిన నాయకులు

తాడ్వాయి(ఎల్లారెడ్డి): టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని శనివారం తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు కామారెడ్డిలో కలిశారు. పదవి రావడంపై అభినందనలు తెలిపారు. వీడీసీ చైర్మన్‌ ఏనుగు మోహన్‌రెడ్డి, లక్ష్మణచారీ, రాజలింగం, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేష్‌రెడ్డి, మధుసుధన్‌రెడ్డి, రాజిరెడ్డి, ముఖేష్‌గౌడ్‌ ఉన్నారు.

వాహనాల తనిఖీ 
1
1/3

వాహనాల తనిఖీ

వాహనాల తనిఖీ 
2
2/3

వాహనాల తనిఖీ

వాహనాల తనిఖీ 
3
3/3

వాహనాల తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement