
లింగారెడ్డిపేటలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో గల లింగారెడ్డిపేట గ్రామంలో మంగళవారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్‌కుమార్ తెలిపారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా లింగారెడ్డిపేట గ్రామంలో ప్రత్యేకంగా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి మొత్తం మురికి కాలువలను శుభ్రం చేయించమన్నారు. అనంతరం తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు.
మహిళలకు రూ.కోటి 58 లక్షల రుణాలు..
ఎల్లారెడ్డి పట్టణంలోని పలు డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.కోటి 58 లక్షల 50 వేల రుణాలను అందించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలు తీసుకున్న రుణాలతో అభివృద్ధి చెందాలని సూచించారు.