
రుద్రూర్ వరి ఆర్‌డీఆర్–1162
ఇది స్వల్ప కాలిక రకం. రెండు కాలలకు అనువైనది. వాన కాలంలో 120–125 రోజులకు, యాసంగిలో 130–135 రోజులకు పంట చేతికి వస్తుంది. మిక్కిలి సన్న గింజ రకం. ఎకరాకు సుమారుగా వాన కాలంలో 32, యాసంగిలో 34 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. తక్కువ నూక శాతం ఉంటుంది. కంకినల్లి, ఉల్లికోడు, ఆకు తెగులు, మెడ విరుపు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. గంగా కావేరి కన్నా అతి సన్న గింజ కలిగి ఉంటుంది. అన్నం మంచి నాణ్యతను, రుచిని కలిగి ఉంటుంది. ఈ రకం 7–10 రోజుల నిద్రావస్థ కలిగి ఉన్నందున కోసిన ధాన్యాన్ని వెంటనే విత్తనంగా వాడు కోవాలంటే బాగా ఎండబెట్టిన తర్వాత మొలక శాతాన్ని పరీక్షించి నారు పోసుకోవాలని పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ అంజయ్య వివరించారు. పరిశోధనలు జరిపి శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వరి రకాలను రైతులు సాగు చేసి లబ్ధి పొందాలని ఆయన కోరారు.