
టేక్రియాల్లో కుక్కల బెడద
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్లో కుక్కల బెడద ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రోడ్డు వెంబడి వెళ్లాలంటే కుక్కలు వెంట పడుతున్నాయని ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడదను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అపరిశుభ్రంగా నీటితొట్టె
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని కుర్లాలోని బస్టాండ్ ప్రధాన రహదారి పక్కన గల పశువుల నీటి తొట్టె అపరిశుభ్రంగా మారింది. నీటితొట్టె పాకురు, నాచు, కలుషితమైన నీటితో నిండిపోయింది వానాకాలం ప్రారంభం అవుతున్న దృష్ట్యా దోమలు, ఈగలు వ్యాప్తి చెందిన రోగాలు ప్రబలే అవకాశాలున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

టేక్రియాల్లో కుక్కల బెడద